: కొడాలి నానిపై దేవినేని ఉమ ఆగ్రహం
హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిన్న జరిగిన సమైక్య శంఖారావం సభ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ స్పందించారు. కొడాలి నాని సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. జగన్ అండతో అంతు చూస్తానని బెదిరించడం సరికాదన్నారు. నిన్న సమైక్య సభలో మాట్లాడుతూ, ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ చంద్రబాబే అప్పట్లో విభజనకు బీజం వేశాడని నాని విమర్శించారు. వైఎస్ చనిపోయినా కూడా, చంద్రబాబు తన పెంపుడు కుక్కలతో ఆయనపై విమర్శలు చేయిస్తున్నారని కూడా నాని వ్యాఖ్యానించారు.