: మధ్యంతర భృతిపై 15 రోజుల్లో నిర్ణయం: సీఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సచివాలయ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు సమావేశమయ్యారు. 8.56 శాతం డీఏ పెంచడంపై ఉద్యోగ సంఘాలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపాయి. మధ్యంతర భృతిపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మహంతి వారికి హామీ ఇచ్చారు. హెల్త్ కార్డులపై సోమవారం ఉత్తర్వులు వెలువడనున్నట్టు ఉద్యోగసంఘాలు తెలిపాయి.