: తినడానికి తిండే లేదు.. ఐఎస్ఐ గురించి ఏం ఆలోచిస్తాం: ముజఫర్ నగర్ బాధితులు


రెండు నెలల కిందట ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటు చేసుకున్న తీవ్ర అల్లర్ల కారణంగా అనేకమంది నిరాశ్రయులుగా మారిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలు చల్లారినా, వారు మాత్రం కనీస సౌకర్యాలు లేక విలవిల్లాడుతున్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వారిని మరింత బాధించాయి. ముజఫర్ నగర్ బాధితులను రిక్రూట్ చేసుకునేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారనడంపై రాహుల్ ను అల్లర్ల బాధితుడు ఆల్ జమీల్ అహ్మద్ కలిశాడు.

తమకు కనీసం తినడానికి తిండి కూడా సరిగా లభ్యం కావడంలేదని వాపోయాడు. తమవద్ద డబ్బులే లేనప్పుడు ఫోన్లెలా పనిచేస్తాయని అమాయకంగా అడిగాడు. సెప్టెంబర్ 10 నుంచి తాను, తన కుటుంబం, ఇంకా వందలమంది రిలీఫ్ క్యాంప్ లో ఉంటున్నామని, ప్రతిరోజు నరకంగా ఉందని.. అలాంటప్పుడు పాక్ ఏజెంట్ల గురించి ఏం ఆలోచిస్తామని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News