: చోరీకి గురైన రూ.10 కోట్ల విలువైన బంగారం స్వాధీనం


జార్ఖండ్ లోని రాంచీలో ఇటీవల ఆనంద్ నగల దుకాణంలో చోరీకి గురైన 12 కోట్ల రూపాయల విలువైన బంగారు నగల్లో 10 కోట్ల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు. దసరా సందర్భంగా ఈ నెల 12 నుంచి 14 వరకు దుకాణాన్ని తెరవలేదు. 15న దుకాణం ఎప్పట్లానే తెరవగా చోరీ జరిగినట్టు గ్రహించారు. దీంతో, ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు బృందాలు చోరీ అయిన బంగారంలో కొంత బంగారాన్ని ఆ దుకాణంపైనున్న వాటర్ ట్యాంకులో కనుగొన్నట్టు వెల్లడించారు. దొంగలు తాము చోరీ చేసిన బంగారాన్ని కొంత వాటర్ ట్యాంకులో వేసి.. గొడవ సద్దుమణిగిన తరువాత ఆ బంగారాన్ని అక్కడి నుంచి తరలించాలని పథకం వేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దర్యాప్తు మాత్రం మరింత ముమ్మరం చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News