: రాష్ట్రాన్ని చీల్చే కుట్రలో జగన్ భాగస్వామి: చంద్రబాబు
రాష్ట్రాన్ని చీల్చే కుట్రలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భాగస్వామి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బెయిల్ కోసం ఆయన ఈ పనికి పాల్పడ్డాడని బాబు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ రెండూ కలిసే రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్ర చేస్తున్నాయని, ప్రజలకు మాత్రం తాము సమైక్యవాదులమనే చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని బాబు అన్నారు. వైఎస్సార్సీపీని ప్రజలు తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.