: 5 నిమిషాల ముందే ముగిసిన సమైక్య శంఖారావం
హైదరాబాదు ఎల్బీస్టేడియంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సమైక్య శంఖారావం సభ నిర్ణీత సమయానికి 5 నిమిషాల ముందే ముగిసింది. ఏవిధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేందుకు హైకోర్టు నుంచి పలు నిబంధనలతో అనుమతి తెచ్చుకున్న వైఎస్సార్సీపీ.. కోర్టు నిర్థేశించిన ప్రకారం సరిగ్గా సాయంత్రం 4.55 నిమిషాలకు ముగించింది. సభలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోటెత్తడంతో స్టేడియం నిండిపోగా, చాలామంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. కోర్టు నిబంధనలను పక్కాగా అనుసరించిన వైఎస్సార్సీపీ ఆ మేరకు 5 నిమిషాల ముందే సభను ముగించింది.