: చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్
ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు దీక్ష చేపట్టింది విభజనకు అనుకూలంగానే అని జగన్ దుయ్యబట్టారు. సమైక్య శంఖారావం సభలో మాట్లాడుతున్న జగన్ బాబుపై ధ్వజమెత్తారు. ఢిల్లీలో బాబు దీక్ష ముగిసేలోపు ఇక్కడ సీఎం కిరణ్ ఉద్యోగులను భయపెట్టి సమ్మె విరమింపజేయించారని తెలిపారు. అంతకుముందు, ఉద్యోగులు బాబును లేఖ వెనక్కి తీసుకోమంటే ఆయన తిరస్కరించారని వెల్లడించారు. అంతేగాకుండా బాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే టీడీపీలోని మిగతా నేతలూ రాజీనామాలు చేస్తారని ఉద్యోగులు కోరగా, బాబు అందుకు కూడా నిరాకరించారని జగన్ వివరించారు. ఇప్పటికీ బాబు తన వైఖరి వెల్లడించకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. ఇక, కిరణ్ విషయానికొస్తే అంతా అయిపోయాక ఆయన రాజీనామా అంటున్నారని మండిపడ్డారు.