: కాంగ్రెస్ తో వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చీకటి ఒప్పందాలున్నాయి: బాబు


వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్, ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ కాంగ్రెస్ లో కలుస్తాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ దొంగ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సీమాంధ్రుల మనోభావాలను పట్టించుకోకుండా... ఢిల్లీలో కూర్చొని రాష్ట్ర విభజన ఎలా చేస్తారని? ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రజలకు సోనియా తన మొహం కూడా చూపించలేరని బాబు వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు ఎన్టీఆర్ అయితే... తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

  • Loading...

More Telugu News