: ప్రియాంక గాంధీకి శస్త్ర చికిత్స


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీకి నేడు శస్త్ర చికిత్స నిర్వహించారు. పిత్తాశయంలో రాళ్ల కారణంగా అనారోగ్యానికి గురవడంతో ప్రియాంకకు ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తేలికపాటి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంకను సోనియా, రాహుల్ గాంధీ పరామర్శించారు. అనంతరం రాహుల్ విలేకర్లతో మాట్లాడుతూ, 'ప్రియాంక భేషుగ్గా ఉంది' అని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News