: తన నిర్ణయాన్ని సోనియా ఇప్పుడెందుకు మార్చుకోరు?: జూపూడి
సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఆవేశంగా ప్రసంగించారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేది లేదని చెబుతున్న సోనియా గతం గుర్తుకు తెచ్చుకోవాలని జూపూడి హితవు పలికారు. అప్పట్లో భర్త రాజీవ్ మరణించిన తర్వాత ప్రశాంతంగా ఉంటే చాలనుకుని రాజకీయాలకు దూరంగా ఉన్నారని, అనంతరం నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఇటీవల రాహుల్ ను ప్రధాని చేయాలనుకోగా, బీజేపీ తీవ్ర విమర్శలు చేయడంతో ఆ నిర్ణయాన్నీ మార్చుకున్నారని జూపూడి పేర్కొన్నారు. పలు నిర్ణయాలు మార్చుకున్న సోనియమ్మ.. ఇప్పుడు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోరని ఆయన ప్రశ్నించారు.