: కాసేపట్లో జగన్ 'సమైక్య శంఖారావం'
మరి కాసేపట్లో జగన్ 'సమైక్య శంఖారావం' సభ ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కానుంది. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. సీమాంధ్ర నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి కూడా జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు 'సమైక్య శంఖారావానికి' హజరయ్యేందుకు భారీ సంఖ్యలో స్టేడియానికి చేరుకుంటున్నారు. నిన్నటి వరకు నగరాన్ని ముంచెత్తిన వర్షాలు ఈ రోజు కాస్త తెరిపి ఇవ్వడంతో జంటనగరాల పరిధిలో ఉండే సమైక్యవాదులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు సమాయత్తమవుతున్నారు.
మరోవైపు, ఎల్బీ స్టేడియం వద్ద సమైక్య ఉద్యమకారులు భారీగా చేరుకోవడంతో నగరవాసులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ దారి మళ్లించారు. ఎల్బీస్టేడియం వద్ద పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణవాదుల నుంచి నిరసన ఎదురయ్యే అవకాశముండడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు.