: జగన్ దిష్టిబొమ్మ దహనం
'సమైక్య శంఖారావం' సభ నేపథ్యంలో తెలంగాణ విద్యార్ధులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. హైదరాబాద్ నిజాం హాస్టల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు, జగన్ దిష్టిబొమ్మకు హాస్టల్ ప్రాంగణంలో శవయాత్ర నిర్వహించారు. జగన్ రెచ్చగొట్టే చర్యలు చేపడితే పరాభవం తప్పదని విద్యార్ధులు హెచ్చరించారు. హాస్టల్ గేట్లకు తాళంవేసి తమను నిర్బంధించడం సరికాదన్నారు.