: 'అభయ' కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు
హైదరాబాదులో చోటుచేసుకున్న 'అభయ' ఘటనపై నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణ విషయంలో తక్షణ చర్యల సూచనల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని సీఎం ఆదేశించారు. ఈ మేరకు నిన్న(శుక్రవారం) నిర్వహించిన సమీక్షలో ఈ విషయంపై చర్చించారు. అభయ వంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందులో ఐటీ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.