: ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రత
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వైఎస్సార్సీపీ తల పెట్టిన 'సమైక్య శంఖారావం' సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, గతంలో ఏపీఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ పట్ల నిజాం కాలేజీ విద్యార్థులు వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. ముందు జాగ్రత్తగా నిజాం కళాశాల హాస్టల్ ముందు, పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.