: ముగ్గురు పాక్ స్మగ్లర్లను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ముగ్గురు పాక్ స్మగ్లర్లను బోర్డర్ సెక్యూరిటీ (బీఎస్ఎఫ్) బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం, వారి నుంచి రూ.120 కోట్ల విలువచేసే 24 కిలోల హెరాయిన్, ఓ ఏకె-47 రైఫిల్, ఓ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారని బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఏకె తోమర్ వెల్లడించారు. పంజాబ్ లోని ముల్లన్ కోట్ వద్ద గత అర్ధరాత్రి అనుమానంగా సంచరిస్తుండటంతో బీఎస్ఎఫ్ జవాన్లు స్మగర్లపై వెంటనే కాల్పులు జరిపినట్లు చెప్పారు. చొరబాటు దారులపై ఎప్పటికప్పుడు అప్తమత్తంగా ఉంటున్న బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరపగా.. ప్రతిగా స్మగర్లు కూడా కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ సమయంలో బీఎస్ఎఫ్ 91 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తోమర్ వివరించారు.