: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ లోని పెద్ద చెరువు పూర్తిగా నిండటంతో... నీరు రోడ్డుపైకి వస్తోంది. దీనికి తోడు, ఐటీ పాముల గ్రామం వద్ద ఉన్న కురుమర్తి చెరువుకు గండి పడటంతో... జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో, రహదారిపై ఉన్న వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వాహనాల్లో ఉన్న ప్రయాణికులు మంచినీరు, ఆహారం లేక అలమటిస్తున్నారు. వరద ప్రవాహం తగ్గడానికి మరో 24 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.