: మరో కొత్త సౌరకుటుంబం


సౌరకుటుంబంలో ఎన్ని గ్రహాలుంటాయి... మనకు తెలిసిన మేర తొమ్మిది గ్రహాలుంటాయి. కానీ ఏడు గ్రహాలు ఉండే ఒక కొత్త సౌరకుటుంబాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 127 కాంతి సంవత్సరాల దూరంలో ఏడు గ్రహాలతో కూడిన ఒక ఖగోళ కుటుంబాన్ని యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీకి చెందిన స్పెక్ట్రోగ్రాఫ్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సౌరకుటుంబంలో ఒక నక్షత్రం చుట్టూ ఐదు గ్రహాలు తిరుగుతున్నాయని, ఈ ఐదింటితోబాటు మరో రెండు గ్రహాలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలా ఏడు గ్రహాలతో కూడిన సౌరకుటుంబాన్ని కనుగొనడం ఇదే తొలిసారి. ఈ నక్షత్రాన్ని హెచ్‌డీ 10180 అనే పేరుతో శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు.

నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల చలనాలను అధ్యయనం చేసినప్పుడు వాటిమధ్య సంక్లిష్టమైన గురుత్వ చర్యలు చోటుచేసుకుంటున్నట్టు తేలిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన క్రిస్టోఫ్‌ లోవిస్‌ తెలిపారు. ఈ నక్షత్రం చుట్టూ ఐదు గ్రహాలు ఆరు నుండి 600 రోజుల వ్యవధిలో పరిభ్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిగిలిన రెండు గ్రహాల్లో ఒకటి నక్షత్రానికి అతి సమీపంలో ఉండి కేవలం 1.18 రోజుల పరిభ్రమణ కాలాన్ని కలిగివుందని, రెండవది 2200 రోజుల పరిభ్రమణ కాలాన్ని కలిగివుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News