: అనంతలో మధ్యాహ్నభోజన పథకం ఇస్కాన్ కు అప్పగింత
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణాస్ కాన్షస్ నెస్ (ఇస్కాన్) ఇప్పుడు అనంతపురం జిల్లాలో మధ్యాహ్నభోజన పథకం బాధ్యతలు స్వీకరించింది. ఇప్పటివరకు ఏజెన్సీలు నిర్వహించిన మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా అమలు కావడంతో అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు. అన్నంలో రాళ్లు, పురుగులు.. నీళ్ల చారు వంటి నాణ్యతలేని వంటకాలతో విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వివిధ ఏజెన్సీలను అధికారులు పక్కనబెట్టారు.
కాగా, ఇస్కాన్ దేశవ్యాప్తంగా కోటి మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. మన రాష్ట్రంలో రాజమండ్రి, కడప, తిరుపతిలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కానే నిర్వహిస్తోంది. కాగా, వారంలో ఓ రోజు అందించే గుడ్డు స్థానంలో ఏదైనా స్వీటు, అరటి పండు ఇస్తామని ఇస్కాన్ పేర్కొంది.