: ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం


హైదరాబాద్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ సమీపంలోని సాయి సర్వీసింగ్ సెంటర్లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొలుత మొదటి అంతస్తులో వ్యాపించిన మంటలు పూర్తిగా 3 అంతస్తులను చుట్టుముట్టాయి. దీంతో సర్వీసింగ్ సెంటర్ లోని కార్లు, ఫర్నీచర్ అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో గోకుల్ థియేటర్ ని మూసివేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News