: రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రపతి, ప్రధానికి సీఎం లేఖ
రాష్ట్ర విభజన అంశంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్ధంగా మాత్రమే జరగాలని ఆయన లేఖలో కోరారు. గతంలో ఏర్పడిన ఛత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆ ప్రకారమే జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరించాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనకు ఇచ్చిన వినతి పత్రాలను లేఖకు జతపరిచారు.