: ట్రాక్ పై నీరు.. దారిమళ్లిన రైళ్లు
నల్గొండ, తిప్పర్తి మధ్య రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు వచ్చి చేరింది. ట్రాక్ బలహీనపడడంతో గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లను; సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే రైళ్లను విజయవాడ మీదుగా మళ్లించారు. విశాఖ-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్ ప్రెస్ నడికుడి నుంచి తిరిగి గుంటూరుకు పయనమైంది. ట్రాక్ పైకి నీరు చేరిన కారణంగా శబరి ఎక్స్ ప్రెస్ నల్గొండ రైల్వే స్టేషన్ లోనే నిలిచిపోయింది.