: కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలు దేశానికే ఆదర్శం: జానారెడ్డి
కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలు దేశంలోనే ఆదర్శ రాష్ట్రాలవుతాయని మంత్రి జానారెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు ఖాయమైన నేపథ్యంలో తెలుగు ప్రజలంతా సామరస్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అనేది భౌగోళికంగా మాత్రమే జరుగుతుందని, మానసికంగా కాదని జానారెడ్డి అన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జానారెడ్డి తెలిపారు.