: అనారోగ్యం వచ్చినప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది: జయసుధ
40 ఏళ్లు దాటిన స్త్రీలంతా రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సినీనటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ సూచించారు. హైదరాబాదులోని మలక్ పేట యశోదా ఆసుపత్రిలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, అనారోగ్యం వచ్చినప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుందని అన్నారు. అందుకే రొమ్ము క్యాన్సర్ పై మహిళలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి ఈ వ్యాధి ఉండడం దీని తీవ్రతను తెలియజేస్తుందని, అందుకే దీనిపై అవగాహన అవసరం అని జయసుధ అభిప్రాయపడ్డారు.