: తెలంగాణ తీర్మానం ఓడిపోతుంది: వీహెచ్
తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది కానీ, అసెంబ్లీకి పంపితే మాత్రం ఓడిపోతుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ పరిధిలో సీమాంధ్ర ప్రాంతంలోనే అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందువల్ల తీర్మానం అసెంబ్లీకి వస్తే తెలంగాణ బిల్లు ఓడిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్, బీజేపీ అనుకూలంగా ఉన్నందున పార్లమెంటులో తెలంగాణ బిల్లు గెలుస్తుందని అన్నారు. సీమాంద్ర ప్రజాప్రతినిధులకు అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించడం సాధ్యపడే అంశమేనన్నారు. కానీ, పార్లమెంటులో వారికి సాధ్యంకాదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.