: కోస్తాంధ్రకు హై అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కోస్తాంధ్రకు హై అలర్ట్ ప్రకటించింది. అల్పపీడనం రాయలసీమ నుంచి తెలంగాణ వైపు కదిలి 24 గంటల పాటు స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. 24 గంటల తర్వాత తెలంగాణ నుంచి మళ్లీ కోస్తాంధ్ర వైపు వెళుతుందని ప్రకటించింది. దీంతో, కోస్తాంధ్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.