: 34 ఏళ్ల రికార్డు బద్ధలుకొట్టిన పుజారా, విజయ్ జోడీ


హైదరాబాద్ టెస్టులో శతకాలతో కదం తొక్కిన పుజారా, విజయ్ జోడీ 34 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టింది. ఆసీస్ తో ఉప్పల్ లో జరుగుతున్న మ్యాచ్ లో రెండో వికెట్ కు రికార్డు స్థాయిలో 370 పరుగులు జోడించారు. భారత్ కు రెండో వికెట్ భాగస్వామ్యాల్లో ఇదే అత్యుత్తమం. ఇంతకుముందు, 1978లో వెస్టిండీస్ పై కోల్ కతాలో గవాస్కర్ (182), వెంగ్ సర్కార్ (157) జోడీ రెండో వికెట్ కు 344 పరుగులు జత చేసింది. 

  • Loading...

More Telugu News