: మతఘర్షణలు చెలరేగినప్పుడల్లా బీజేపీ, ఐఎస్ఐ సంతోషిస్తాయి: కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ మరో కొత్త వివాదానికి తెరలేపింది. మనదేశంలో ఎక్కడ మతఘర్షణలు చెలరేగినా బీజేపీ, పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ ఆనందంలో మునిగితేలుతాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ షకీల్ అహ్మద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముజఫర్ నగర్ ముస్లిం బాధితులను ఐఎస్ఐ కలవడానికి ప్రయత్నిస్తోందని నిన్న రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ మాటలు భారతీయ ముస్లింల దేశభక్తిని కించపరిచేలా ఉన్నాయని బీజేపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో షకీల్ అహ్మద్ ఈ విధంగా కామెంట్ చేశారు.