: రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు..
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రాంతాలవారీగా గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్తిపాడులో 26, విశాఖలో 16, కల్వకుర్తి, కొల్లాపూర్, టెక్కలిలో 15, రెంటచింతల, అవనిగడ్డలో 14, యర్రగండపాలెం, కోడేరులో 13, అచ్చంపేట, నాగర్ కర్నూలులో 12, నరసాపురం, కందుకూరు, కళింగపట్నం, గుడివాడ, మాచర్ల, ఎలమంచిలిలో 11, దేవరకొండ, కైకలూరు, మందస, ఏలూరుల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.