: ఢిల్లీ పీఠం బీజేపీదే: సీఎం అభ్యర్థి హర్షవర్థన్
ఢిల్లీ పీఠం బీజేపీదేనని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ తెలిపారు. ఢిల్లీలో 15 ఏళ్లు అధికారంలో ఉన్న షీలాదీక్షిత్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు. తమ పార్టీలో ఎలాంటి కుమ్ములాటలు లేవని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.