: తమిళనాడులోనూ పసిడి వేట..!


తమిళనాడులో బంగారం వేట ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే, ఇది చదవండి. ఉత్తరప్రదేశ్ లో వెయ్యి టన్నుల బంగారం ఉందంటూ ఓ సాధువుకు కలొచ్చిందని తవ్వకాలు మొదలు పెట్టారు.. ఖజానా నింపుకునేందుకు. అయితే, తమిళనాడులో అందుకు భిన్నంగా పేదలకు పంచిపెట్టడానికి 120 కోట్ల రూపాయలతో 400 కేజీల బంగారం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోటి నాలుగు గ్రాముల బరువు ఉండేలా 22 కేరట్ల బంగారు నాణేలు కొనుగోలు చేయనుంది. అందుకోసం వేట మొదలు పెట్టింది తమిళనాడు సర్కారు. వివరాల్లోకెళితే..

తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణమస్తు కార్యక్రమంలో అర్హులైన పేదలకు ఈ బంగారు నాణేలు అందజేయనుంది. ఈ బంగారు నాణేల కోసం ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార భోజన పథకం డైరెక్టరేట్ టెండర్లు పిలిచింది. వచ్చే నెల 22 లోపు టెండర్లు దాఖలు చేయవచ్చు. టెండరు దక్కించుకున్నవారు 30 రోజుల్లో ప్రభుత్వానికి నాణేలు అందజేయాలి. అయితే, ఇంత భారీ మొత్తంలో బంగారం నిల్వలు అందుబాటులో ఉండటం అంత సామాన్య విషయం కాదని, ప్రభుత్వానికి నాణేలు అందజేయడం సవాలుతో కూడిన పని అని మద్రాస్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంఘం అధ్యక్షుడు జయంతిలాల్ చల్లానీ తెలిపారు.

  • Loading...

More Telugu News