: కాలువకు గండి... 50 రొయ్యల చెరువులు మునక
భారీ వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కొమ్మమూరు కాలువకు గండి పడింది. దీంతో, పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఈ నీటి ప్రవాహంతో 50 రొయ్యల చెరువులు మునిగిపోయాయి. దీంతో, రైతులకు రూ.7 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.