: సచిన్ ప్రజలను ఆకర్షించగలడు కానీ ఓట్లు రాబట్టలేడు : బీజేపీ
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సచిన్ టెండూల్కర్, సినీనటి రేఖలను ఉపయోగించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. సచిన్, రేఖలు ప్రజలను ఆకర్షించగలరు కానీ... ఆ ఆకర్షణను ఓట్లుగా మలచలేరని బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గియ విమర్శించారు. 'సచిన్ అద్భుతమైన క్రికెట్ తో జనాలను ఉర్రూతలూగించగలడు... అలాగే అమితాబ్ బచ్చన్ ను రేఖ ప్రభావితం చేయగలదు... కానీ వీరిద్దరూ కాంగ్రెస్ కు ఓట్లు సంపాదించలేరు' అని వ్యంగ్యంగా అన్నారు. అంతే కాకుండా, కైలాష్ ఒకడుగు ముందుకేసి... వీరిద్దరినీ 'నైట్ ల్యాంప్' తో పోల్చారు. క్రికెట్ లో ఎలాంటి విమర్శకైనా బ్యాట్ తో సమాధానం చెప్పే సచిన్ ఈ విమర్శకు ఎలా సమాధానం చెబుతాడో వేచిచూడాలి.