: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించా: కిల్లి కృపారాణి
కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఈ ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను ప్రార్థించినట్టు తెలిపారు. కాగా, నేటి ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మంత్రికి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.