: 'ఉల్లి'పై నేడు కేంద్ర మంత్రుల భేటీ


కిలో ఉల్లి ధర ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాలలో 100 రూపాయలను సమీపించడంతో పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీలో ఈ రోజు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్, ఆహార మంత్రి థామస్ సమావేశం కానున్నారు. ఉల్లి ధరల కారణంగా వచ్చే నెల జరిగే ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందన్న భయంతో ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ కూడా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడమే సమస్యకు పరిష్కారంగా కేంద్రం భావిస్తోంది. కేంద్రం ఆదేశాలతో నాఫెడ్ ఉల్లి దిగుమతులకు టెండర్ కూడా ఆహ్వానించింది. మరో మూడు వారాల పాటు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతాయని పవార్ నిన్న బెంగళూరులో వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News