: కాంగ్రెస్ లో చేరిన క్రీడాకారిణి కృష్ణ పూనియా


క్రీడాకారిణి, డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజస్థాన్ లో జరిగిన ఓ ర్యాలీ సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు. రాజస్థాన్ కు చెందిన పూనియా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని, క్రీడల్లో దేశం కోసం పతకాలు సాధించానని, ఇప్పుడు ప్రజలకు సేవచేయాలనుకుంటున్నాని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News