: ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి: అశోక్ బాబు
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి తమకు బాధ కలిగిస్తోందని తెలిపారు. తీర్మానం అసెంబ్లీకి వస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.