: విండీస్ తో టెస్టు సిరీస్ కు 29న టీమిండియా ఎంపిక
వెస్టిండీస్ జట్టుతో వచ్చే నెలలో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు ఈ నెల 29న భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఆసీస్ తో ఆరో వన్డేకు ముందు రోజు చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుందని బీసీసీఐ స్పష్టం చేసింది. విండీస్ తో జరిగే టెస్టులకు వేదికలుగా ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం ఖరారయ్యాయి. కాగా ఈ సిరీస్ తరువాత దిగ్గజ క్రికెటర్ సచిన్ తన అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలకనున్నాడు.