: సీమాంధ్రలోకి భద్రాచలం?


రాష్ట్ర విభజన జరిగితే భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుతారా? దీనికి సమాధానం ఔననే తెలుస్తోంది. ఎందుకంటే పోలవరం డ్యామ్ ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని సీమాంధ్ర ప్రాంతంలో కలపాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కేంద్రం సేకరించినట్టు సమాచారం.

పోలవరం వల్ల ముంపుకు గురయ్యే దాదాపు 227 గ్రామాల్లో 95 శాతం భద్రాచలం డివిజన్లోనే ఉన్నాయి. పోలవరానికి ఇప్పటికే జాతీయ హోదాను కల్పించారు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే దాన్ని ఎలాగైనా పూర్తి చేస్తారు. కాబట్టి, డ్యాం నిర్మాణం పూర్తయ్యే వరకు ఎలాంటి అభ్యంతరాలు కానీ ఆటంకాలు కానీ ఉండరాదు. పోలవరం ఆయకట్టు సీమాంధ్ర రాష్ట్రంలో, ముంపు ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. దీన్ని అధిగమించడానికి, భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపడమే మేలని కేంద్ర భావిస్తోంది.

  • Loading...

More Telugu News