: విభజనపై మా పార్టీ వాళ్ళు కోర్టుకు వెళితే అడ్డుకుంటాం: టీ.టీడీపీ నేత దయాకర్ రెడ్డి
రాష్ట విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ నాయకులు కోర్టుకెళితే అడ్డుకుంటామని తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నేత కె.దయాకరరెడ్డి హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. విభజన తీరు, జరిగే అన్యాయంపై కోర్టుకు వెళితే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.