: టీడీపీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలను ఖండించిన నాగబాబు
తన సోదరుడు పవన్ కల్యాణ్, తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని నటుడు నాగబాబు ప్రకటించారు. అంతేకాక టీడీపీకి మద్దతిస్తున్నారంటూ వచ్చిన రూమర్లను కూడా ఆయన ఖండించారు. ప్రస్తుతం తాము సినిమాలతో బిజీగా ఉన్నామని తెలిపారు. కాగా, తామిద్దరం కొత్త పార్టీ పెడుతున్నామన్నది కూడా నిరాధారమని తెలిపారు. మీడియా కథనాలతో ప్రజలు, అభిమానుల్లో గందరగోళం ఏర్పడిందని మీడియా సమావేశంలో నాగబాబు వెల్లడించారు.