: రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో నలుగురి అరెస్టు
స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కేసులో హెడ్ కానిస్టేబుల్ కృష్ణగౌడ్, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారు షాపూర్ లోని ఓ ఫాం హౌస్ లో వ్యాపారి బుచ్చిరెడ్డిని నిర్బంధించి డబ్బుకోసం బెదిరించినట్లు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బుచ్చిరెడ్డి కిడ్నాప్ కేసును శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.