: రాజీనామా చేసిన ఉత్తరప్రదేశ్ మంత్రి రాజా భయ్యా


హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ మంత్రి రాజా భయ్యా తన పదవికి రాజీనామా చేశారు. ప్రతాప్ గడ్ జిల్లా డీఎస్పీ హత్య ఉదంతంలో ఆయనపై కేసు నమోదు కావడంతో సొమవారం పదవి నుంచి తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు పంపారు.

కాగా, మరో ముగ్గురి హత్య వ్యవహారంలోనూ మంత్రికి సంబంధం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, తన భర్త హత్యపై శనివారం సాయంత్రమే డీఎస్పీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News