: రైలు టాయిలెట్లో ప్రసవం.. పట్టాలపైకి జారిన పసికందు సేఫ్!
కదులుతున్న రైల్లోంచి పట్టాలపై పడిన ఓ పసికందు సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన ఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది. పశ్చిమబెంగాల్ లోని జుమ్కా గ్రామానికి చెందిన రెహానా బీబీ అనే గర్భిణి ముర్షిబాద్ వద్ద లాల్ గొలా ప్యాసింజర్ రైలు ఎక్కింది. నదియా జిల్లా పాలాషి రైల్వే స్టేషన్ చేరుకుంటున్న సమయంలో రెహానా టాయిలెట్ కు వెళ్లింది. అక్కడే బిడ్డను ప్రసవించింది. ప్రసవవేదన నుంచి తేరుకునే లోపు పసిబిడ్డ మరుగుదొడ్డి కన్నం నుంచి జారి రైలు పట్టాలపై పడింది. విషయం తెలుసుకున్న తోటి ప్రయాణీకులు రైలు ఆపి చిన్నారిని కాపాడి, తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ క్షేమంగా ఉన్నారు. కాగా, ఆ పసికందుకు చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం.