: అత్యాచారం చేసి పీక పిసికేశారు


నిర్భయ ఉదంతం కామాంధుల్లో మార్పుతీసుకురాలేదు. రోజు రోజుకూ రేపిస్టులు పెరిగిపోతున్నారే తప్ప తగ్గడం లేదు. తాజాగా, ఉత్తర ప్రదేశ్ లో ఘోరం వెలుగు చూసింది. పదమూడేళ్ల బాలికపై ఓ యువకుడు, అతని స్నేహితులు అత్యాచారం చేసి తరువాత గొంతు నులిమి చంపేశారు. మృతురాలు ఇద్దరు మిత్రులతో మీరట్ లోని ఇస్లాంనగర్ మదర్సాలో తరగతులకు హాజరయ్యేందుకు వెళ్లింది. తరువాత ఇల్లు చేరలేదని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు పర్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడకు తువ్వాలు చుట్టి ఉండగా, బాలిక నుదుటిపై గాయాలున్నాయి. దీంతో, ఓ యువకుడితో పాటు, బాలిక ఇద్దరు స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News