: మహిళా ఓటర్లే ఎక్కువ.. కానీ, శాసనసభలో ఒక్కరూ కనపడరే!


మిజోరాం రాష్ట్రానికి వెళ్లి చూస్తే మహిళలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆ రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువ. 3,36,799 మంది పురుష ఓటర్లు ఉంటే, 3,49,506 మహిళా ఓటర్లు ఉన్నారు. కానీ, ఆ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టి చూస్తే ఒక్కరంటే ఒక్క మహిళా ప్రజాప్రతినిధీ కనిపించరు. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. 1972లో అసోం నుంచి విడివడిందీ రాష్ట్రం. ఈ రాష్ట్ర శాసనసభలో ఇన్నేళ్లలో అంటే 41 ఏళ్ల కాలంలో మొత్తంగా ఆరుగురు మహిళా ప్రజాప్రతినిధులే అడుగుపెట్టగలిగారు. అందులోనూ ముగ్గురు నామినేట్ చేయబడినవారే.

  • Loading...

More Telugu News