: రెండు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్?
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ను నియమించే అవకాశమున్నట్టు సమాచారం. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు రాజకీయ, సామాజిక, సాంఘిక అంశాలపై నరసింహన్ కు ఉన్నంత పట్టు మరెవరికీ లేదు. దీంతో, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి గవర్నర్ గా నరసింహన్ రెండు రాష్ట్రాల కార్యకలాపాలను నిర్వహిస్తారని ఢిల్లీలో వార్తలు గుప్పుమంటున్నాయి.