: విశాఖ స్టీల్ ప్లాంటులో కూలిన ఫ్లాగ్ యార్డు పైకప్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ ఫ్లాగ్ యార్డు పైకప్పు కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో కార్మికులెవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానిక ఎలమంచిలి చెరువుకు గండి పడి పలు ప్రాంతాలు నీట మునిగాయి.