: మందుబాబులు ముందే పోతారట!


'మందుబాబులం మేము, మందుబాబులం' అంటూ చక్కగా మందు కొట్టేసి పాట పాడుకుంటూ ఉండే బాటిల్‌ బాబులకు ఒక హెచ్చరిక. ఏమనగా మందు కొట్టడం వల్ల మీ ఆయుర్దాయం క్రమేపీ క్షీణిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చక్కగా ఫుల్లుగా మందుకొట్టేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మందు కొట్టడానికి పలు కారణాలను మందుబాబులు చెబుతుంటారు. కారణాలు ఎన్ని చెప్పినా వారు తాగే మందు వల్ల వారి శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోతాయట. వాటి గోడలు మొద్దుబారిపోయి రక్తప్రసరణ సమస్యలు తలెత్తుతాయని, ఫలితంగా వారికి గుండె పోటు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఫిన్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఫిన్‌డ్రింక్‌ స్టడీలో భాగంగా నిపుణులు దాదాపు 2,600 మంది పురుషులను 11 నుండి 20 ఏళ్లపాటు పరిశీలించి, ఈ విషయాన్ని తేల్చారు. రోజూ కాకుండా ఏదో పండుగపూట కాస్త మందుపుచ్చుకుంటాను అనే వారికి రోజూ పెగ్గు లాగించేవారితో పోల్చుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం కాస్త తక్కువేనట. అయితే రక్తపోటు, స్థూలకాయంతో బాధపడేవారు అస్సలు మందుజోలికి వెళ్లవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందుతాగడం వల్ల వీరికి గుండెపోటు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని, కాబట్టి మందును దూరంగా ఉంచితే మేలని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News