: భారత అంగారక యాత్ర నవంబర్ 5న
450 కోట్ల రూపాయలతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంగారక యాత్ర(మార్స్ మిషన్) నవంబర్ 5న ప్రారంభించనున్నట్టు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ప్రకటించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు . పీఎస్ఎల్ వీ హీట్ షీల్డ్ మూసివేశామని ఆయన చెప్పారు. రేపు ఎలక్ట్రికల్ భాగాల తుది పరీక్ష జరుగుతుందని వెల్లడించారు.