: 'సమైక్య శంఖారావం సభ' సోనియాకు సవాల్ విసరడానికే: వాసిరెడ్డి పద్మ
రాష్ట్రాన్ని విభజించాలనుకున్న సోనియాకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, సోనియాకు సవాల్ విసరడానికే లక్షలాది మందితో 'సమైక్య శంఖారావం' సభ నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర మంత్రుల బృందం దగ్గరకు వెళ్లడమంటే రాష్ట్ర విభజనను అంగీకరించడమేనని పద్మ అభిప్రాయపడ్డారు.